ఎమ్మెల్యేలతో కలిసి షోలే సినిమా చూసిన సీఎం
ABN , First Publish Date - 2020-07-20T04:35:50+05:30 IST
జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి షోలే సినిమా చూశారు. తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్, బీటీపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వారం రోజులుగా

జైపూర్: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి షోలే సినిమా చూశారు. తనకు మద్దతిస్తున్న కాంగ్రెస్, బీటీపీ, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి ఆయన వారం రోజులుగా జైపూర్‌లోని ఫెయిర్‌మౌంట్ హోటల్‌లో ఉంటున్నారు. ఉదయాన్నే లగాన్ సినిమా చూసిన ఎమ్మెల్యేలు ఆ తర్వాత అంత్యాక్షరి కూడా ఆడారు. పాటలు పాడుతూ వినోదంగా గడిపారు.
18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలతో కలిసి సచిన్ పైలట్ తిరుగుబాటు చేయడంతో గెహ్లాట్ జాగ్రత్త పడి మిగతా కాంగ్రెస్, చిన్న పార్టీల ఎమ్మెల్యేలను, ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలను ఫెయిర్‌మౌంట్ హోటల్‌కు తరలించారు. గవర్నర్ విశ్వాస పరీక్ష నిర్వహించేవరకూ వీరు ఇదే హోటల్‌లో ఉండే అవకాశముంది. ఈలోగా సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలని, పైలట్ వెంట వెళ్లిన ఎమ్మెల్యేలందరినీ వెనక్కు పిలిపించుకోవాలని కాంగ్రెస్ తీవ్రంగా యత్నిస్తోంది.