బలపరీక్షలో చౌహాన్‌ గెలుపు

ABN , First Publish Date - 2020-03-25T07:58:52+05:30 IST

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో బలపరీక్ష నెగ్గారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులెవరూ హాజరుకాలేదు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మొదలవగానే సభ...

బలపరీక్షలో చౌహాన్‌ గెలుపు

కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల గైర్హాజరు.. సింధియాపై కేసు ఎత్తివేత


భోపాల్‌, మార్చి 24: మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అసెంబ్లీలో మూజువాణి ఓటుతో బలపరీక్ష నెగ్గారు. ప్రతిపక్ష కాంగ్రెస్‌ సభ్యులెవరూ హాజరుకాలేదు. మంగళవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు మొదలవగానే సభ విశ్వాసాన్ని కోరుతూ చౌహాన్‌ ఏకవాక్య ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. దాన్ని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. బీజేపీ సీనియర్‌ ఎమ్మెల్యే జగదీశ్‌ దేవ్‌డా స్పీకర్‌గా వ్యవహరించారు. ఆయన స్పీకర్‌ ప్యానల్‌ సభ్యుడు కూడా. ఇద్దరు బీఎస్పీ, ఓ ఎస్పీ, ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా బలపరీక్షలో బీజేపీ ప్రభుత్వానికి మద్దతు తెలిపారు. విశ్వాస పరీక్ష అనంతరం ఈ నెల 27వ తేదీకి అసెంబ్లీ వాయిదాపడింది. సీఎంగా చౌహాన్‌ సోమవారం రాత్రి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. కొన్ని గంటలకే స్పీకర్‌ ఎన్పీ ప్రజాపతి రాజీనామా చేశారు. కాగా, కేంద్ర మాజీ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఆయన కుటుంబ సభ్యులపై కేసును మధ్యప్రదేశ్‌ ఆర్థిక నేరాల విభాగం మూసివేసింది. డాక్యుమెంట్లు ఫోర్జరీ చేసి గ్వాలియర్‌లో భూమి అమ్మినట్లు గతంలో వారిపై కేసు నమోదైన విషయం తెలిసిందే.

Updated Date - 2020-03-25T07:58:52+05:30 IST