కాంగ్రెస్ ఎమ్మెల్యేతో సహా భార్య, కుటుంబంలోని 18 మందికి కరోనా పాజిటివ్
ABN , First Publish Date - 2020-06-23T21:18:22+05:30 IST
రాజస్థాన్ రాజధాని జైపూర్‌తోపాటు జోధ్‌పూర్‌లో కరోనా కొంతవరకు అదుపులోనికి వచ్చిందనుకునేంతలో, రాష్ట్రంలోని భరత్‌పూర్, ధౌల్‌పూర్‌లలో ఈ మహమ్మారి తన విలయతాండవం మొదలుపెట్టింది

ధౌల్‌పూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌తోపాటు జోధ్‌పూర్‌లో కరోనా కొంతవరకు అదుపులోనికి వచ్చిందనుకునేంతలో, రాష్ట్రంలోని భరత్‌పూర్, ధౌల్‌పూర్‌లలో ఈ మహమ్మారి తన విలయతాండవం మొదలుపెట్టింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం రాజస్థాన్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గిరిరాజ్‌సింగ్ మలింగతో పాటు అతని భార్య కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. అలాగే అతని కుటుంబంలోని 18 మంది కూడా కరోనా పాజిటివ్ అని వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా బారి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివదయాళ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కొత్తగా మరో 77 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. ఈ కేసులలో బారి ఎమ్మెల్యే గిరిజార్ సింగ్ మలింగ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారన్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను హోంక్వారంటైన్‌లో ఉంచి, చికిత్స అందిస్తున్నామన్నారు. కాగా ధౌల్‌పూర్‌లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 500 కి చేరుకుంది. సాధారణ ప్రజలతో పాటు, రాజకీయ నేతలు, వైద్య సిబ్బంది, పోలీసు సిబ్బంది పరిపాలనా సిబ్బంది కూడా కరోనా బారిన పడుతున్నారు. దీంతో అందరిలోనూ ఆందోళన నెలకొంది.