సోనియా, రాహుల్‌ లేకుండానే నేడు కాంగ్రెస్‌ భేటీ

ABN , First Publish Date - 2020-09-21T07:36:59+05:30 IST

కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులు సోమవారం భేటీ కానున్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ లేకుండానే వారు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు...

సోనియా, రాహుల్‌ లేకుండానే నేడు కాంగ్రెస్‌  భేటీ

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20 : కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులు సోమవారం భేటీ కానున్నారు. సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ లేకుండానే వారు పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించనున్నారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని తెలుపుతూ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్‌చార్జులు, ప్రత్యేక కమిటీ సభ్యులకు లేఖ రాశారు. 

Updated Date - 2020-09-21T07:36:59+05:30 IST