హాథ్రస్ బాధితురాలి ఇంటికి చేరుకున్న రాహుల్, ప్రియాంక

ABN , First Publish Date - 2020-10-04T01:44:07+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురై, ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ...

హాథ్రస్ బాధితురాలి ఇంటికి చేరుకున్న రాహుల్, ప్రియాంక

హాథ్రస్: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌లో గ్యాంగ్‌రేప్‌కు గురై, ఢిల్లీలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయిన యువతి కుటుంబాన్ని పరామర్శించేందుకు కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంక బాధితురాలి ఇంటికి వెళ్లారు. హాథ్రస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు యూపీ పోలీసుల నుంచి రాహుల్, ప్రియాంకతో పాటు మరో ముగ్గురికి అనుమతి లభించింది. హాథ్రస్‌లో 144 సెక్షన్ అమలులో ఉందని, అందుకే ఐదుగురిని మాత్రమే అనుమతించామని పోలీసులు తెలిపారు. అయితే రాహుల్, ప్రియాంక బయల్దేరిన నేపథ్యంలో వారి వెంట కార్యకర్తలు కూడా తరలివచ్చారు. అయితే కార్యకర్తలందర్నీ ఢిల్లీ టోల్‌గేట్ వద్ద పోలీసులు నిలిపివేశారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.


ఇదిలా ఉంటే.. హాథ్రస్‌ దళిత బాలిక గ్యాంగ్‌రేప్‌, హత్య ఘటనపై, దాన్ని కప్పిపుచ్చేందుకు ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల మీద సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హాథ్రస్‌ జిల్లాలోని బుల్‌ గార్గి గ్రామాం చుట్టూ పోలీసులు పహారా కాస్తున్నారు. ఊరి చుట్టూ బారికేడ్లు కట్టారు. గ్రామంలో 144 సెక్షన్‌ విధించారు.

Updated Date - 2020-10-04T01:44:07+05:30 IST