అజిత్ దోవల్ కుమారుడికి జైరాం రమేశ్ బహిరంగ క్షమాపణలు

ABN , First Publish Date - 2020-12-19T20:16:32+05:30 IST

కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్‌కు బహిరంగ క్షమాపణలు తెలిపారు

అజిత్ దోవల్ కుమారుడికి జైరాం రమేశ్ బహిరంగ క్షమాపణలు

న్యూఢిల్లీ : కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కుమారుడు వివేక్ దోవల్‌కు బహిరంగ క్షమాపణలు తెలిపారు. ఓ పరువు నష్టం కేసులో కోర్టులోనే జైరాం లిఖితపూర్వకంగా వివేక్ దోవల్‌కు క్షమాపణలు తెలిపారు. ‘‘వివేక్ దోవల్‌తో పాటు ఆయన తండ్రి అజిత్ దోవల్ పై క్షణికావేశంలో ఆరోపణలు చేశా. పైగా అది ఎన్నికల సమయం కూడా. క్షణికావేశంలోనే ఆయన కుటుంబ సభ్యుల గురించి, వ్యాపారాల గురించి మాట్లాడాను. వాటిని ధ్రువీకరించకోకుండానే ఆరోపణలు చేశాను. అందుకే క్షమాపణలు తెలుపుతున్నా. దీంతో ఈ కేసును మూసేయాలని అనుకున్నాం.’’ అని జైరాం రమేశ్ తెలిపారు. 

ఏం జరిగిందంటే....

2019 లో అజిత్ దోవల్ కుమారుడు వివేర్ దోవల్ కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ పై పరువు నష్టం దావా వేశారు. ఆ సమయంలో జైరాం రమేశ్ పత్రికలో ఓ వ్యాసం రాశారు. ఈ పత్రికలో జైరాం రమేశ్ చేసిన ఆరోపణలన్నీ తప్పుడు ఆరోపణలని, అంతేకాకుండా అవే విషయాలను మీడియా సమావేశంలో కూడా జైరాం మాట్లాడారని వివేక్ దోవల్ ఆరోపించారు. వివేక్ దోవల్ తో పాటు ఆయన కుటుంబీకులు నిర్వహిస్తున్న కంపెనీలన్నీ ‘డి కంపెనీలే’’ అని జైరాం ఆరోపించారు. 

Read more