ఏకే ఆంటోనీ నేతృత్వంలో కమిటీ వేసిన అధిష్ఠానం

ABN , First Publish Date - 2020-12-30T17:04:07+05:30 IST

విజయ దివస్ 50 వ వార్షికోత్సవాల నిర్వహణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ కమిటీ వేసింది. ఈ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ

ఏకే ఆంటోనీ నేతృత్వంలో కమిటీ వేసిన అధిష్ఠానం

న్యూఢిల్లీ : విజయ దివస్ 50 వ వార్షికోత్సవాల నిర్వహణపై కాంగ్రెస్ అధిష్ఠానం ఓ కమిటీ వేసింది. ఈ కమిటీకి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ నేతృత్వం వహిస్తారు. సభ్యులుగా మాజీ స్పీకర్ మీరా కుమారి, పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్, మహారాష్ట్ర మాజీ సీఎం పృథ్విరాజ్ చవాన్, మాజీ మంత్రి జితేంద్ర సింగ్ సభ్యులుగా ఉంటారు. ‘‘ఈ కమిటీకి అధిష్ఠానం ఆమోదముద్ర వేసింది. చరిత్రాత్మకమైన 1971  యుద్ధంలో విజయం సాధించాం. 50 వ వార్షికోత్సవాన్ని జరుపుకున్నాం. ఈ సందర్భంగా కాంగ్రెస్ నిర్వహించే కార్యకలాపాల ను సమన్వయం చేయడానికి కాంగ్రెస్ ఓ కమిటీ వేసింది. దీనికి ఏకే ఆంటోనీ అధ్యక్షత వహిస్తారు. దీనికి అధిష్ఠానం ఆమోద ముద్ర వేసింది.’’ అని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. 

1971 లో తూర్పు పాకిస్తాన్‌లో స్వతంత్ర పోరు మొదలై భారత్, పాక్ మధ్య యుద్ధానికి దారితీసింది. ఇందులో పాక్‌ను భారత్ ఓడించింది. ఆ తర్వాతే బంగ్లాదేశ్‌ ఏర్పడింది. ఈ ఏడాదితో భారత్ విజయానికి 50 ఏళ్లు  పూర్తైంది. 

Updated Date - 2020-12-30T17:04:07+05:30 IST