కాంగ్రెస్‌ ఉత్సవానికి సోనియా, రాహుల్‌ డుమ్మా

ABN , First Publish Date - 2020-12-29T09:05:12+05:30 IST

కాంగ్రెస్‌ 136వ వ్యవస్థాపక దినోత్సవానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ డుమ్మా కొట్టారు. ఢిల్లీలోని

కాంగ్రెస్‌ ఉత్సవానికి సోనియా, రాహుల్‌ డుమ్మా

న్యూఢిల్లీ, డిసెంబరు 28: కాంగ్రెస్‌ 136వ వ్యవస్థాపక దినోత్సవానికి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, అగ్రనేత రాహుల్‌గాంధీ డుమ్మా కొట్టారు. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో పార్టీ అగ్రనేత ఏకే ఆంటోనీ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రియాంక గాంధీ సహా పార్టీ సీనియర్‌ నేతలు గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ తదితరులు హాజరయ్యారు. కాగా, పార్టీ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమాన్ని పట్టించుకోకుండా రాహుల్‌ ఇటలీకి వెళ్లారన్న బీజేపీ ఆరోపణలను కాంగ్రెస్‌ ఖండించింది. రాహుల్‌ వ్యక్తిగత కారణాలతోనే ఇటలీకి వెళ్లారని, పార్టీకి ఆయన ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటున్నారని రణదీప్‌ సుర్జేవాలా తెలిపారు. ‘‘రాహుల్‌ డుమ్మాకు నూటొక్క కారణాలు ఉన్నాయి. ఎలాంటి ఊహాగానాలకు ఆస్కారం లేదు. ప్రియాంక జీ ఇక్కడ ఉన్నారు కదా’’ అని సల్మాన్‌ ఖుర్షీద్‌ చెప్పారు.  

Updated Date - 2020-12-29T09:05:12+05:30 IST