ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-12-26T02:07:13+05:30 IST

పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అసోం ఎమ్మెల్యే అజంతా నియోగ్‌పై కాంగ్రెస్ వేటు..

ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన కాంగ్రెస్

న్యూఢిల్లీ: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన అసోం ఎమ్మెల్యే అజంతా నియోగ్‌పై కాంగ్రెస్ వేటు వేటు వేసింది. ఆమె పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని శుక్రవారంనాడు రద్దు చేసింది. అజంతా నియోగ్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ చేసిన ప్రతిపాదనకు కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆమోదముద్ర వేశారని, ఇది తక్షణం అమల్లోకి వచ్చిందని ఏఐసీసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈనెల మొదట్లో అసోం ముఖ్యమంత్రి సర్బానంద్ సోనోవాల్, నార్త్ ఈస్ట్ డెమొక్రటిక్ అలయెన్స్ కన్వీనర్ హిమాంత బిస్వా శర్మను అజంతా నియోగ్ కలుసుకున్నారు. దీంతో ఆమె బీజేపీలో చేరే అవకాశాలున్నాయంటూ ఊహాగానాలు వెలువడ్డాయి. వచ్చే ఏడాదిలో అసోం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.

Updated Date - 2020-12-26T02:07:13+05:30 IST