రాజస్థాన్‌లోని అన్ని కార్యవర్గాలనూ రద్దు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం

ABN , First Publish Date - 2020-07-15T21:19:10+05:30 IST

యువనేత సచిన్ పైలెట్ ఎపిసోడ్‌తో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. రాజస్థాన్‌లో పార్టీని కిందినుంచి ప్రక్షాళన చేయాలని

రాజస్థాన్‌లోని అన్ని కార్యవర్గాలనూ రద్దు చేసిన కాంగ్రెస్ అధిష్ఠానం

జైపూర్ : యువనేత సచిన్ పైలెట్ ఎపిసోడ్‌తో కాంగ్రెస్ అధిష్ఠానం అప్రమత్తమైంది. రాజస్థాన్‌లో పార్టీని కిందినుంచి ప్రక్షాళన చేయాలని డిసైడ్ అయ్యింది. ఇందులో భాగంగా రాష్ట్ర కార్యవర్గాన్ని, జిల్లా, మండల కార్యవర్గాలను కూడా రద్దు చేసేసింది. అతి తొందర్లోనే పూర్తి కొత్త ముఖాలతో ఈ కార్యవర్గాలన్ని కూడా ప్రకటిస్తామని అగ్రనేతలు వెల్లడించారు. పార్టీ శ్రేణిలో కింది వరకూ పేరుకుపోయిన సచిన్ పైలెట్ అనుయాయులను తొలగించి, పూర్తి ప్రక్షాళన చేస్తామని ప్రకటించారు. ‘‘రాజస్థాన్‌కు చెందిన రాష్ట్ర కార్యవర్గాన్ని, జిల్లా, మండల కార్యవర్గాలను ఏఐసీసీ రద్దవుతాయి. తొందర్లోనే వాటిని పూరించే ప్రక్రియ ప్రారంభిస్తాం’’ అని రాజస్థాన్ వ్యవహారాల ఇన్‌చార్జీ, జాతీయ ప్రధాన కార్యదర్శి అవినాశ్ పాండే ప్రకటించారు. 

Updated Date - 2020-07-15T21:19:10+05:30 IST