ముఖ్యమంత్రిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

ABN , First Publish Date - 2020-12-13T21:13:11+05:30 IST

కేరళ స్థానిక సంస్థల ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు మరి కొద్ది గంటలే మిగిలి ..

ముఖ్యమంత్రిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు

తిరువనంతపురం: కేరళ స్థానిక సంస్థల ఎన్నికల చివరి విడత పోలింగ్‌కు మరి కొద్ది గంటలే మిగిలి ఉండగా ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై విపక్ష యూడీఎఫ్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ముఖ్యమంత్రి ఉల్లంఘించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది.


రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కోవిడ్-19 వ్యాక్సిన్ పంపిమీ చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించడం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని కాంగ్రెస్ నేత జోసెష్ తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ వి.భాస్కరన్‌ను ఆయన ఫిర్యాదు చేశారు. ఈనెల 8న స్థానిక సంస్థల తొలి దశ పోలింగ్‌ ఐదు జిల్లాల్లో జరగగా, 72.67 శాతం పోలింగ్ నమోదు అయింది. రెండో విడతగా మరో ఐదు జిల్లాల్లో 10వ తేదీన 76.38 శాతం పోలింగ్ జరిగింది. చివరి విడత పోలింగ్ ఈనెల 14న జరుగనుంది. 2021 మేలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కీలకంగా ఈ స్థానిక ఎన్నికలను అన్ని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి. ప్రధానంగా లెఫ్ట్ డెమోక్రాటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్), యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్), నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

Updated Date - 2020-12-13T21:13:11+05:30 IST