ట్విట్టర్ సోదరి.. బీజేపీ అప్రకటిత అధికార ప్రతినిధి: మాయావతిపై కాంగ్రెస్ ఫైర్

ABN , First Publish Date - 2020-05-25T03:02:16+05:30 IST

వలసకార్మికులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలవడాన్ని డ్రామాగా అభివర్ణించిన బీఎస్పీ అధినేత మాయావతిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది.

ట్విట్టర్ సోదరి.. బీజేపీ అప్రకటిత అధికార ప్రతినిధి: మాయావతిపై కాంగ్రెస్ ఫైర్

లక్నో: వలసకార్మికులను కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కలవడాన్ని డ్రామాగా అభివర్ణించిన బీఎస్పీ అధినేత మాయావతిపై కాంగ్రెస్ పార్టీ ఆగ్రహం వ్యక్తంచేసింది. కరోనా కష్టకాలంలో వలసకార్మికుల పాట్లు తగ్గించడానికి కాంగ్రెస్ చేపడుతున్న చర్యలపై మాయావతి ఆగ్రహంగా ఉన్నారని ఆరోపించింది. ‘ఈ ట్విట్టర్ సోదరి బీజేపీకి తయారు చేసిన ప్రెస్‌నోట్‌నే చదువుతోంది’ అంటూ కాంగ్రెస్ నేత పీఎల్ పునియా ఎద్దేవా చేశారు. వలస కార్మికుల కోసం కాంగ్రెస్ పార్టీ, జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా చేపడుతున్న చర్యలపై మాయావతి ఆగ్రహంగా ఉన్నారని ఆయన ఎత్తిపొడిచారు. రాహుల్ గాంధీపై బీజేపీ, బీఎస్పీ చేసిన విమర్శలు చూస్తేనే ఈ రెండు పార్టీల మధ్య లోపాయకారి ఒప్పందం ఉన్నట్లు తెలిసిపోతోందని ఆరోపించారు. ఇదే సమయంలో కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మన్ బ్రిజల్ ఖబ్రి మాట్లాడుతూ.. ‘మాయావతి బీజేపీకి అప్రకటిత అధికార ప్రతినిధి’ అంటూ విమర్శించారు.

Updated Date - 2020-05-25T03:02:16+05:30 IST