‘గోవధ’పై ఇందిర దారిలో కాంగ్రెస్‌!

ABN , First Publish Date - 2020-12-27T09:58:05+05:30 IST

‘గోవధ’పై ఇందిర దారిలో కాంగ్రెస్‌!

‘గోవధ’పై ఇందిర దారిలో కాంగ్రెస్‌!

న్యూఢిల్లీ, డిసెంబరు 26: దేశ వ్యాప్తంగా బీజేపీని ఎదుర్కోవడంలో సిద్ధాంతపరంగా కొన్ని అంశాల్లో స్పష్టత లేకుండా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌.. తొలిసారిగా ఓ కీలక అంశాన్ని కదపడానికి సిద్ధమవుతోంది. గోవులను రక్షించడం, గోవధపై నిషేధం విధించడం ద్వారా హిందువుల మద్దతు పొందుతున్న బీజేపీని ఇరుకున పెట్టే కార్యక్రమానికి పూనుకుంది. గోరక్షణ, గోవధ అంశాలపై దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హయాం నాటి ‘బ్యాలెన్స్‌డ్‌’ విధానం పాటించే దిశగా ముందుకెళుతోంది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమానికి గోవుల అంశాన్ని ముడిపెట్టాలని యోచిస్తోంది. ఇందులో భాగంగా ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ సభను, ప్రచారాన్ని నిర్వహించే ప్రయత్నాల్లో ఉంది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ వాద్రా పాల్గొననున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-12-27T09:58:05+05:30 IST