మా నాన్న ఆరోగ్యం గతంలో కంటే బాగానే ఉంది : అభిజిత్ ముఖర్జీ

ABN , First Publish Date - 2020-08-16T18:06:13+05:30 IST

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత

మా నాన్న ఆరోగ్యం గతంలో కంటే బాగానే ఉంది : అభిజిత్ ముఖర్జీ

న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని ఆయన కుమారుడు, కాంగ్రెస్ నేత అభిజిత్ ముఖర్జీ ఆదివారం వెల్లడించారు. గతంతో పోలిస్తే ఆరోగ్యం కూడా కాస్త బాగానే ఉందని ఆయన తెలిపారు. ‘‘ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మా నాన్నను నిన్న సందర్శించా. అందరి ప్రార్థనలతో గతంలో కంటే ఆయన ఆరోగ్యం చాలా బాగుంది. స్థిరంగా కూడా ఉంది. చికిత్స కూడా స్పందిస్తున్నారు. తొందర్లోనే ఆయన పూర్తి ఆరోగ్యవంతుడిగా బయటికి వస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం’’ అని అభిజిత్ ముఖర్జీ ట్విట్టర్ వేదికగా తెలిపారు. 

Updated Date - 2020-08-16T18:06:13+05:30 IST