ఆ ఐదు నగరాల్లో నిబంధనలు మరింత కఠినతరం!

ABN , First Publish Date - 2020-04-24T22:22:58+05:30 IST

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే.

ఆ ఐదు నగరాల్లో నిబంధనలు మరింత కఠినతరం!

చెన్నై: తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సడలింపులతో లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఐదు నగరాల్లో పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. చెన్నై, మదురై, కోయంబత్తూర్ నగరంలో నాలుగు రోజుల పాటు(ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 29 వరకు) ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ప్రకటించారు. అదేవిధంగా సేలం, తిరుప్పూర్‌లో మూడు రోజుల పాటు(ఏప్రిల్ 26 నుంచి ఏప్రిల్ 28) వరకు పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ అమల్లో ఉంటుందన్నారు. మెడికల్ సంబంధిత విషయాల్లో మాత్రం వెసులుబాటు కల్పించారు.


ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్‌ ఉంటుంది. అయితే ప్రస్తుత ప్రకటనతో సంబంధిత ఐదు పట్టణాల్లో మరింత కఠిన నిబంధనలతో లాక్‌డౌన్ అమలు కానుంది. దీని ప్రకారం ఈ పట్టణాల్లో కిరాణా దుకాణాలు, కూరగాయల మార్కెట్లు అన్నీ బంద్ చేశారు. ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వ వర్గాలే ముబైల్ షాప్స్ ఏర్పాటు చేశారు. అయితే ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్‌కు అనుమతి ఇచ్చారు. ఇప్పటి వరకూ లాక్‌డౌన్ నిబంధనలను ప్రజలు ఎవరూ సరిగా పాటించలేదని, ఈ కారణంగా నిబంధనలను కఠినతరం చేయడం జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2020-04-24T22:22:58+05:30 IST