సంపూర్ణ అష్ట దిగ్బంధనంలో చెన్నై... ప్రభుత్వ స్పందన కోరిన హైకోర్టు...

ABN , First Publish Date - 2020-06-12T02:58:38+05:30 IST

కోవిడ్-19 మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో చెన్నై, పరిసర ప్రాంతాల్లో

సంపూర్ణ అష్ట దిగ్బంధనంలో చెన్నై... ప్రభుత్వ స్పందన కోరిన హైకోర్టు...

చెన్నై : కోవిడ్-19 మహమ్మారి కేసులు పెరుగుతుండటంతో చెన్నై, పరిసర ప్రాంతాల్లో సంపూర్ణ అష్ట దిగ్బంధనం అమలు చేయడంపై అభిప్రాయం చెప్పాలని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని మద్రాస్ హైకోర్టు కోరింది. 


రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్-19 మహమ్మారిని నిరోధించేందుకు అనేక చర్యలు అమలు చేస్తున్నప్పటికీ, రోజు రోజుకూ కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు పేర్కొంది. మరీ ముఖ్యంగా చెన్నై, దాని శివారు ప్రాంతాల్లో పరిస్థితి  ఆందోళనకరంగా ఉందని తెలిపింది. 


ఈ మహమ్మారిని కట్టడి చేయడానికి ఏదైనా ప్రత్యేక పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిందా? అని ప్రభుత్వ న్యాయవాది జయప్రకాశ్ నారాయణ్‌ను ప్రశ్నించింది. లిస్టెడ్ కేసులను ముగించిన తర్వాత వర్చువల్ కోర్టు ప్రొసీడింగ్స్ సందర్భంగా హైకోర్టు ఈ ప్రశ్న వేసింది. 


రాష్ట్ర, నగర ప్రజల ప్రయోజనార్థం తాము ఈ ప్రశ్న వేస్తున్నట్లు న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీనిపై స్వీయ విచారణ జరపడం లేదని స్పష్టం చేశారు.


రాష్ట్రంలో నమోదైన కేసుల్లో 70 శాతం కేసులు చెన్నై, దాని శివారు ప్రాంతాలకు చెందినవే కావడంతో హైకోర్టు ఈ విధంగా స్పందించింది.


Updated Date - 2020-06-12T02:58:38+05:30 IST