పాక్‌ జెండా, మ్యాపును పోస్ట్‌ చేసిన ప్రొఫెసర్‌

ABN , First Publish Date - 2020-07-10T08:00:46+05:30 IST

పాకిస్థాన్‌ జెండా, మ్యాపును ఉత్తరప్రదేశ్‌ బరేలీలోని రోహిల్‌ఖండ్‌ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ సలీం ఖాన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన ఈ పోస్టు చేశారని...

పాక్‌ జెండా, మ్యాపును పోస్ట్‌ చేసిన ప్రొఫెసర్‌

బరేలీ, జూలై 9: పాకిస్థాన్‌ జెండా, మ్యాపును ఉత్తరప్రదేశ్‌ బరేలీలోని రోహిల్‌ఖండ్‌ వర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ సలీం ఖాన్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతాలో పోస్టు చేశారు. భారతీయుల మనోభావాలు దెబ్బతినేలా ఆయన ఈ పోస్టు చేశారని విశ్వ హిందూ పరిషత్‌ నేత నీరూ భరద్వాజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సలీంపై బరాదర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. 


Updated Date - 2020-07-10T08:00:46+05:30 IST