ఆన్‌లైన్‌లో పోటీలు.. విజేతలకు బహుమతులు

ABN , First Publish Date - 2020-04-14T07:21:57+05:30 IST

లాక్‌డౌన్‌ బోరు కొడుతోందా? అయితే మీకోసమే ఈ పోటీ. పాల్గొనండి.. మీ ప్రతిభను ప్రదర్శించండి.. బహుమతులు గెలుచుకోండి.. ఈ ప్రకటన చేసింది పోలీసులు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా రాజస్థాన్‌లోని...

ఆన్‌లైన్‌లో పోటీలు.. విజేతలకు బహుమతులు

  • రాజస్థాన్‌ పోలీసుల వినూత్న యత్నం

జైపూర్‌, ఏప్రిల్‌ 13: లాక్‌డౌన్‌ బోరు కొడుతోందా? అయితే మీకోసమే ఈ పోటీ. పాల్గొనండి.. మీ ప్రతిభను ప్రదర్శించండి.. బహుమతులు గెలుచుకోండి.. ఈ ప్రకటన చేసింది పోలీసులు.  కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా రాజస్థాన్‌లోని చురూ జిల్లాలో పోలీసులు.. లాక్‌డౌన్‌ వేళ ప్రజలను కట్టడి చేసేందుకు ఆన్‌లైన్లో ఓ పోటీ నిర్వహిస్తున్నారు. ‘మీలో దాగివున్న ప్రతిభను ప్రదర్శిస్తూ.. ఓ నాలుగు నిమిషాల వీడియోను తీసి పోస్టు చేయండి. గెలుపొందిన వారికి బహుమతులిస్తాం’ అంటూ ప్రకటించారు. ఇందులో విజేతలకు బహుమతులతో పాటుగా భవిష్యత్తులో ‘పోలీస్‌ మిత్ర’లుగా పనిచేసే అవకాశం కూడా కల్పిస్తామని వారు చెబుతున్నారు.  


Updated Date - 2020-04-14T07:21:57+05:30 IST