కలర్ బ్లైండ్ ఉన్నవారికి కేంద్రం శుభవార్త

ABN , First Publish Date - 2020-03-13T16:52:17+05:30 IST

కలర్ బ్లైండ్ వారికి శుభవార్త... కలర్ బ్లైండ్ ఉన్నవారు కూడా ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖ ముసాయిదాను తాజాగా రూపొందించింది....

కలర్ బ్లైండ్ ఉన్నవారికి కేంద్రం శుభవార్త

న్యూఢిల్లీ :  కలర్ బ్లైండ్ వారికి శుభవార్త... కలర్ బ్లైండ్ ఉన్నవారు కూడా ఇక నుంచి డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా కేంద్ర రోడ్లు, రవాణా మంత్రిత్వశాఖ ముసాయిదాను తాజాగా రూపొందించింది. దేశంలో మొత్తంమీద 3 శాతం మందిలో కలర్ బ్లైండ్ నెస్ సమస్య ఉంది. పురుషుల్లో 8 శాతం మంది, మహిళల్లో 4 శాతం మంది కలర్ బ్లైండ్ సమస్యతో బాధపడుతున్నారు. తమకు కూడా వాహనాలు నడిపేందుకు వీలుగా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయాలని కోరుతూ దేశవ్యాప్తంగా పలువురు కలర్ బ్లైండ్ నెస్ సమస్య ఉన్నవారు కేంద్ర రోడ్డు రవాణ మంత్రిత్వశాఖకు విన్నవించారు.దీంతో కలర్ బ్లైండ్ ఉన్నవారికి కూడా వాహనాలు నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయాలని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కు చెందిన అప్తాలమిస్టుల ప్యానల్ సిఫార్సు చేశారు. ఈ నేపథ్యంలో కలర్ బ్లైండ్ నెస్ ఉన్నవారికి కూడా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేసేందుకు కేంద్ర రోడ్డు, రవాణ మంత్రిత్వశాఖ డ్రాఫ్టును సిద్ధం చేసింది. ఈ డ్రాఫ్టును పార్లమెంటు ఆమోదిస్తే ఇక వారికి కూడా డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయనున్నారు.

Updated Date - 2020-03-13T16:52:17+05:30 IST