స్నేహితుడి భార్యపై కల్నల్‌ అత్యాచారం

ABN , First Publish Date - 2020-12-15T08:01:11+05:30 IST

సైన్యంలో కల్నల్‌ హోదాలో ఉన్న అధికారి అతడు. కానీ.. విచక్షణ మరిచి స్నేహితుడి భార్యపైనే దారుణానికి ఒడిగట్టాడు.

స్నేహితుడి భార్యపై కల్నల్‌ అత్యాచారం

కాన్పూర్‌, డిసెంబరు 14: సైన్యంలో కల్నల్‌ హోదాలో ఉన్న అధికారి అతడు. కానీ.. విచక్షణ మరిచి స్నేహితుడి భార్యపైనే దారుణానికి ఒడిగట్టాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో విధులు నిర్వహిస్తున్న నిందితుడు ఇటీవలే లెఫ్టినెంట్‌ కల్నల్‌ స్థాయి నుంచి కల్నల్‌గా పదోన్నతి పొందాడు. అతడి స్నేహితుడు రష్యన్‌ యువతిని పెళ్లి చేసుకున్నాడు. చాలాకాలంగా ఆమెపై కన్నేసిన నిందితుడు, తన పదోన్నతి సందర్భాన్ని వాడుకుని పశువాంఛ తీర్చుకోవాలని ప్రణాళిక రచించాడు. పార్టీ ఇస్తున్నానని స్నేహితుడిని శనివారం ఇంటికి పిలిచి, అతడితో మత్తుమందు కలిపిన పానీయాన్ని తాగించాడు. అనంతరం అతడి భార్యపై అత్యాచారానికి పాల్పడి పరారయ్యాడు. బాధితులు కంటోన్మెంట్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు. 

Updated Date - 2020-12-15T08:01:11+05:30 IST