మా సిటీకి వచ్చేయండి.. ఎలన్ మస్క్‌కు ఆహ్వానం!

ABN , First Publish Date - 2020-05-14T01:07:08+05:30 IST

అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్‌ మస్క్‌ ప్రధాన కార్యాలయం ఉంది.

మా సిటీకి వచ్చేయండి.. ఎలన్ మస్క్‌కు ఆహ్వానం!

కొలరాడో: అమెరికాలోని కాలిఫోర్నియా నగరంలో ప్రముఖ వ్యాపారవేత్త ఎలన్‌ మస్క్‌ ప్రధాన కార్యాలయం ఉంది. అయితే ఇటీవలి కాలంలో కాలిఫోర్నియా ప్రభుత్వం తీరుపై మస్క్ ఆగ్రహం వ్యక్తంచేశాడు. అతనికి చెందిన టెస్లా ఫ్రెమాంట్ సదుపాయాన్ని ప్రభుత్వం మూసివేయడంపై మస్క్ తీవ్రమైన అసంతృప్తి వ్యక్తపరిచాడు. ఈ క్రమంలోనే తన విషయంలో ఇలా పద్ధతి తప్పి ప్రవర్తిస్తే కాలిఫోర్నియా విడిచి వెళ్లిపోతానని మస్క్ హెచ్చరించాడు. తన ప్రధాన కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి మార్చేస్తానని బెదిరించాడు. దీనిపై కొలరాడో గవర్నర్ జారెడ్ పోలిస్ స్పందించారు. మస్క్ ప్రధాన కార్యాలయాన్ని తమ సిటీకి మార్చుకోవాలని సూచించారు. దీనికి ట్విట్టర్ వేదికగా బదులిచ్చిన మస్క్.. ‘కొలరాడో అద్భుత నగరం. ఇక్కడి విధానాలు చక్కగా ఉంటాయని భావిస్తున్నా’ అని సమాధానమిచ్చాడు. 

Read more