308 కేసుల్లో 168 వారివే: యోగి

ABN , First Publish Date - 2020-04-07T18:23:47+05:30 IST

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ 308 కేసులు నమోదయ్యాయని, ఇందులో 168 కేసులు తబ్లీగీ జమాతే నుంచి వచ్చిన వారివేవని...

308 కేసుల్లో 168 వారివే: యోగి

లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటివరకూ 308 కేసులు నమోదయ్యాయని, ఇందులో 168 కేసులు తబ్లీగీ జమాతే నుంచి వచ్చిన వారివేవని సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటివరకూ పది ల్యాబ్‌లు ఏర్పాటు చేసి కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. యూపీ కోవిడ్ కేర్ ఫండ్‌ను ఆరోగ్య వసతులు మెరుగుపరిచేందుకు ఉపయోగిస్తామని చెప్పారు.  


గత నెలలో ఢిల్లీ నిజాముద్దీన్‌లో తబ్లీగీ జమాతే సదస్సు జరిగింది. ఈ సదస్సుకు దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు, మత పెద్దలు హాజరయ్యారు. సదస్సు ముగిశాక కూడా అనేకమంది అదే భవనంలో ఉండిపోయారు. జనతా కర్ఫ్యూ సమయంలో కూడా వందలాది మంది అదే భవనంలో ఉండటంతో అధికారులు బలవంతంగా వారిని బయటకు రప్పించాల్సి వచ్చింది. ఈ సదస్సుకు హాజరైన వారిలో సుమారు రెండు వేల మందికి కరోనా సోకింది. మరోవైపు తబ్లీగీ చీఫ్ మౌలానా మహ్మద్ సాద్ పరారీలో ఉన్నారు.

Updated Date - 2020-04-07T18:23:47+05:30 IST