ప్రియాంక గాంధీ అభ్యర్థనకు ఆమోదం తెలిపిన సీఎం యోగి

ABN , First Publish Date - 2020-05-18T22:19:26+05:30 IST

అవురియా ఘటనలో 24 మంది మృతి చెందడం, 36 మంది గాయాల పాలుకావడంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక

ప్రియాంక గాంధీ అభ్యర్థనకు ఆమోదం తెలిపిన సీఎం యోగి

లక్నో : వలస కార్మికుల నిమిత్తమై 1,000 ప్రత్యేక బస్సులు వేయాలంటూ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ చేసిన విజ్ఞాపనకు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ అంగీకరించారు. బస్సుల వివరాలు, డ్రైవర్ల పేర్లు, నంబర్లు తమకు పంపాలంటూ కాంగ్రెస్ కార్యాలయానికి ఆయన లేఖ రాశారు. అవురియా ఘటనలో 24 మంది మృతి చెందడం, 36 మంది గాయాల పాలుకావడంతో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వీడియో ద్వారా ముఖ్యమంత్రి యోగికి ఓ అభ్యర్థన పెట్టారు.


‘‘ప్రియమైన ముఖ్యమంత్రి గారూ. అనేక ప్రయాసలకు ఓర్చి చాలా మంది కార్మికులు కాలినడకనే స్వస్థలాలకు చేరుకుంటున్నారు. వారికి సహాయం అందించడానికి మా పార్టీ ఆధ్వర్యంలో బస్సులను ఏర్పాటు చేశాం. ఆ బస్సులు యూపీ సరిహద్దుల్లో నిలిచిపోయి ఉన్నాను. వాటికి అనుమతినివ్వండి. రాజకీయాలకు ఇది సమయం కాదు. బస్సులకు అనుమతినిచ్చి కార్మికులకు సహాయపడదాం’’ అంటూ ఈ నెల 16 న ప్రియాకం గాంధీ యోగిని కోరారు. దీంతో సీఎం యోగి సోమవారం ప్రియాంక గాంధీ అభ్యర్థనకు ఆమోదం తెలిపారు. 

Updated Date - 2020-05-18T22:19:26+05:30 IST