ఎయిమ్స్‌కు సీఎం రావత్
ABN , First Publish Date - 2020-12-29T09:03:24+05:30 IST
కరోనా బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ (60)ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు.
18న పాజిటివ్.. ఐసోలేషన్
న్యూఢిల్లీ, డిసెంబరు 28: కరోనా బారినపడి హోం ఐసోలేషన్‌లో ఉన్న ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ (60)ను ఢిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. రావత్, ఆయన భార్య, కుమార్తెకు ఈ నెల 18న పాజిటివ్‌గా తేలింది. ఛాతీలో ఇనెక్షన్ ఉండటంతో పరీక్షలు చేయాల్సిన అవసరం ఉందని వైద్యులు చెప్పారు. దీంతో ఢిల్లీ ఎయిమ్స్‌కు మార్చారు. కాగా, దేశంలో ఆదివారం 20,021 మందికి వైరస్ నిర్ధారణ అయింది. మరో 279 మంది మృతి చెందారు. 21,131 మంది కోలుకున్నారు. కరోనా కట్టడికి జారీచేసిన మార్గదర్శకాలను జనవరి 31 వరకు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది.