పొలంలో దిగి నాట్లు వేసిన సీఎం

ABN , First Publish Date - 2020-03-08T16:12:13+05:30 IST

రైతు బిడ్డనని సగర్వంగా చెప్పు కునే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిజంగానే రైతుగా మారారు. పొలంలో దిగి మహిళలతో కలసి నాట్లు వేశారు.

పొలంలో దిగి నాట్లు వేసిన సీఎం

  • నాగపట్టణం వైద్య కళాశాలకు శంకుస్థాపన

ప్యారీస్‌: రైతు బిడ్డనని సగర్వంగా చెప్పు కునే ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిజంగానే రైతుగా మారారు. పొలంలో దిగి మహిళలతో కలసి నాట్లు వేశారు.

రైతులను పలుకరించి వారి అనుభ వాలను, ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పొలంలో దిగి నాట్లు వేయడం రైతుల్లో ఆనందాన్ని నింపింది. జిల్లా కేంద్రం నాగపట్టణంలో ప్రభుత్వం తరఫున నిర్మించే వైద్యకళాశాల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి శనివారం కారులో బయల్దేరారు. దారిలో తిరువారూర్‌ జిల్లా నీడామం గళం సమీపంలోని సిద్ధమల్లి అనే గ్రామంలో రైతులు పొలంలో దిగి పనులు చేస్తుండడం చూశారు. వెంటనే తన కారు నిలిపి కిందకు దిగి పాదరక్షలు విడిచి సీఎం కూడా పొలంలో దిగారు. అప్పడు మహిళలతో కలసి ఆయన నాట్లు వేశారు.


శంకుస్థాపన


నాగపట్టణం మున్సిపాలిటీ పరిధిలోని వరత్తూర్‌ ప్రాంతంలో 60.04 ఎకరాల విస్తీర్ణంలో రూ.366.85 కోట్ల వ్యయంతో సంవత్సరానికి 150 మంది విద్యార్థులు చదువుకొనేలా వైద్యకళాశాల నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఆరు అంతస్తులతో నిర్మితం కానున్న భవనంలో ప్రభుత్వ వైద్యకళాశాల, నిర్వాహక అధికా రుల కార్యాలయాలు, నర్సింగ్‌ క్వార్టర్స్‌, బ్యాంక్‌, పోస్టాఫీసు, వ్యాయామ కేంద్రం, ఎయిర్‌ కండిషన్‌ వసతి కలిగిన మార్చురీ విభాగాలు చోటుచేసు కోను న్నాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేలాంకన్ని నుంచి 3 కి.మీ దూరంలో ఉన్న వరత్తూర్‌లో కొత్త వైద్యకళాశాల శంకు స్థాపన కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఆయనతో పాటు ఉప ముఖ్యమంత్రి ఒ.పన్నీర్‌సెల్వం, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ కూడా భూమి పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోనే నాట పట్టణం జిల్లాలో కొత్తగా నిర్మించిన తహసీల్దార్‌ కార్యాలయం, నర్సింగ్‌ శిక్షణ పాఠశాల సహా పలు ప్రభుత్వ భవనాలను సీఎం ప్రారంభించారు.

Updated Date - 2020-03-08T16:12:13+05:30 IST