పొడిగించమని ప్రధానికి లేఖ రాసేందుకు సిద్ధమే : నారాయణ స్వామి

ABN , First Publish Date - 2020-04-08T20:53:56+05:30 IST

లాక్‌డౌన్ పొడగించమని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి బుధవారం

పొడిగించమని ప్రధానికి లేఖ రాసేందుకు సిద్ధమే : నారాయణ స్వామి

పాండిచ్చేరి : లాక్‌డౌన్ పొడిగించమని ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని పాండిచ్చేరి ముఖ్యమంత్రి నారాయణ స్వామి బుధవారం ప్రకటించారు. ‘‘లాక్‌డౌన్ పొడగించమని ప్రధాని మోదీకి లేఖ రాసేందుకు తాము సిద్ధమే. కరోనా వైరస్‌ను అరికట్టాలంటే ప్రజలు ఇళ్లలో ఉండటం మినహా గత్యంతరం లేదు’’ అని ఆయన పేర్కొన్నారు.


ఇప్పటి వరకూ పాండిచ్చేరిలో ఐదు పాజిటివ్ కేసులు నమోదు కాగా... అందులో ఒకరు కోలుకున్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు లాక్‌డౌన్ కొనసాగించడం వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రధాని మోదీ కూడా శనివారం రెండోసారి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. అందులోనే లాక్‌డౌన్ పొడగింపుపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. 

Updated Date - 2020-04-08T20:53:56+05:30 IST