డెంగ్యూపై ప్రచారం చేపట్టిన సీఎం

ABN , First Publish Date - 2020-07-19T22:36:28+05:30 IST

దోమల వల్ల కలిగే డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్..

డెంగ్యూపై ప్రచారం చేపట్టిన సీఎం

డెహ్రాడూన్: దోమల వల్ల కలిగే డెంగ్యూ వ్యాధి పట్ల ప్రజలు అప్రత్తంగా ఉండాలని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఆదివారంనాడు పిలుపునిచ్చారు. దోమల వల్ల డెంగ్యూ జ్వరాలు ప్రబలే అవకాశం ఉందని, దోమల వ్యాప్తిని నిరోధించేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, దీనిపై విస్తృత ప్రచారంలో పాల్గొనాలని కోరారు. డెంగ్యూ వ్యాప్తి చెందకుండా ప్రతి  ఆదివారం కనీసం ఒక 15 నిమిషాలైనా కేటాయించి, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని సూచించారు.


'కరోనా వైరస్‌తో పాటు, డెంగ్యూ పట్ల మనమంతా అప్రమత్తంగా ఉండాలి. మన పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రతి వారం ఒక 15 నిమిషాల పాటు డెంగ్యూపై దాడికి మనం సమయం కేటాయించుకోవాలి. ఇందులో ప్రజా భాగస్వామ్యం చాలా అవసరం' అని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డెంగ్యూ వ్యతిరేక ప్రచారంలో అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Updated Date - 2020-07-19T22:36:28+05:30 IST