వలస కార్మికులకు సీఎం విజ్ఞప్తి

ABN , First Publish Date - 2020-05-11T01:06:15+05:30 IST

వలస కార్మికులు తరలివెళ్లడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. కార్మికులెవరూ ఢిల్లీని విడిచి వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ ఎప్పటికీ ఉండదని, త్వరలోనే లాక్‌డౌన్‌ను

వలస కార్మికులకు సీఎం విజ్ఞప్తి

న్యూఢిల్లీ: వలస కార్మికులు తరలివెళ్లడంపై ముఖ్యమంత్రి కేజ్రీవాల్ స్పందించారు. కార్మికులెవరూ ఢిల్లీని విడిచి వెళ్లవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. లాక్‌డౌన్ ఎప్పటికీ ఉండదని, త్వరలోనే లాక్‌డౌన్‌ను ఎత్తివేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు వలస కార్మికులు తమ తమ ప్రాంతాల్లోనే ఉండాలని కోరారు. ఆదివారం ఇక్కడ మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఎందరో వలస కార్మికులు తమ తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారని, చిన్న పిల్లలను భుజాన వేసుకుని వందల కిలోమీటర్లు నడచుకుంటూ వెళ్లడం వల్ల వాళ్ల కాళ్లకు బొబ్బలు వస్తున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి దృశ్యాలు తనను కలచివేశాయని చెప్పుకొచ్చారు. వలస కార్మికుల విషయంలో ప్రభుత్వాలు, వ్యవస్థ మొత్తం విఫలమైనట్లు అనిపిస్తోందన్నారు. లాక్‌డౌన్ ఎల్లకాలం ఉండదని, దయచేసి వలస కార్మికులు ఢిల్లీని విడిచి వెళ్లొద్దని సీఎం కేజ్రీవాల్ కోరారు.

Updated Date - 2020-05-11T01:06:15+05:30 IST