ఝార్ఖండ్‌ కాంగ్రె్‌సలోనూ ముసలం?

ABN , First Publish Date - 2020-08-01T09:10:48+05:30 IST

మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల తరహాలో ఝార్ఖండ్‌లోనూ కాంగ్రె్‌సలో ముసలం పుట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున గెలిచిన..

ఝార్ఖండ్‌ కాంగ్రె్‌సలోనూ ముసలం?

పార్టీ నాయకత్వంపై పలువురు ఎమ్మెల్యేల అసంతృప్తి!

సంకీర్ణ సర్కారు సీఎం హేమంత్‌ సోరెన్‌పై కినుక

రాంచీ, జూలై 31: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌ల తరహాలో ఝార్ఖండ్‌లోనూ కాంగ్రె్‌సలో ముసలం పుట్టే సూచనలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఆ పార్టీ తరఫున గెలిచిన 15 మంది ఎమ్మెల్యేల్లో సగం మంది.. రాష్ట్ర నాయకత్వం పైనా, ముఖ్యమంత్రి హేమంత్‌ సోరెన్‌ నేతృత్వంలోని జేఎంఎం-కాంగ్రెస్‌ సంకీర్ణ సర్కారు తీరు పట్ల అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. హేమంత్‌ సోరెన్‌ ప్రభుత్వం కూడా గత బీజేపీ ప్రభుత్వం లాగే వ్యవహరిస్తోందని, ఆయన కేబినెట్‌ నలుగురు కాంగ్రెస్‌ మంత్రులు కూడా ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరు బహిరంగంగానే ఆరోపించారు. అంతేకాదు.. ముగ్గురు ఎమ్మెల్యేలు గత బుధవారం ఢిల్లీకి వెళ్లి సీనియర్‌ నేత అహ్మద్‌ పటేల్‌ను కలిశారు. రాష్ట్ర పార్టీ నాయకత్వంతోపాటు సీఎం సోరెన్‌పైనా ఆయనకు ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. తమ అసంతృప్తిని రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లాలనుకున్నా..కొన్ని శక్తులు తమకు ఆ అవకాశం ఇవ్వడంలేదని ఎమ్మెల్యే ఇర్ఫాన్‌ అన్సారీ వ్యాఖ్యానించారు. అయితే సోరెన్‌ మంత్రివర్గంలో మరో బెర్తు ఖాళీగా ఉండటంతో దాని కోసమే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు గ్రూపు కట్టారన్న ప్రచారం కూడా జరుగుతోంది. 

Updated Date - 2020-08-01T09:10:48+05:30 IST