సీఎంకు ‘కరోనా’ రాదు! : మంత్రి

ABN , First Publish Date - 2020-06-21T13:52:11+05:30 IST

సీఎంకు ‘కరోనా’ రాదు! : మంత్రి

సీఎంకు ‘కరోనా’ రాదు! : మంత్రి

చెన్నై: ప్రజల పట్ల ప్రేమానురాగాలు కలిగిన తమిళనాడు ముఖ్యమంత్రికి ‘కరోనా’ సోకదని, వచ్చినా సత్వరం నయమవు తుందని రాష్ట్ర సహకార శాఖ మంత్రి సెల్లూర్‌ రాజు పేర్కొన్నారు. మదురైలో మంత్రి మాట్లాడుతూ.. కరోనా వ్యాప్తిని అడ్డుకొనేలా జిల్లా యంత్రాంగం, కార్పొరేషన్లు సంయుక్తంగా చర్యలు చేపట్టాయ న్నారు. ఆరోగ్య నిపుణుల సూచనల మేరకు కరోనా పరీక్షలను కూడా అధికం చేశామని, కరోనా నిరోధక చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ అమలుపై జిల్లా యంత్రాంగం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. పొరుగు జిల్లాల నుంచి జిల్లాకు వచ్చే వారి సంఖ్య అధికమైందని, వారందరికి జిల్లా సరిహద్దుల్లోనే వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కరోనాపై ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు చేపట్టామని, పలువురు తమకు కరోనా సోకదనే ధైర్యంతో బయట తిరుగుతున్నారన్నారు. కానీ, కరోనా మహమ్మారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. 

Updated Date - 2020-06-21T13:52:11+05:30 IST