మద్యం దుకాణాల మూతకు హైకోర్టు ఆదేశాలు

ABN , First Publish Date - 2020-05-09T01:49:27+05:30 IST

మే 7వ తేదీ నుంచి ప్రభుత్వం వైన్ షాపులు తెరిచేందుకు ఇటీవల కొన్ని షరతులతో కోర్టు అనుమతించింది. అయితే, దుకాణాలు తెరవగానే జనం సామాజిక దూరాన్ని ..

మద్యం దుకాణాల మూతకు హైకోర్టు ఆదేశాలు

చెన్నై: తమిళనాడు ప్రభుత్వానికి మద్రాసు హైకోర్టు శుక్రవారంనాడు షాక్ ఇచ్చింది. లాక్‌డౌన్ ఎత్తేసేంత వరకూ మద్యం దుకాణాలు మూసేయాలని కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే, ఆన్‌లైన్, హోం డెలివరీ పద్ధతుల్లో మద్యం అమ్మకాలకు కోర్టు అనుమతి ఇచ్చింది. జస్టిస్ వినీత్ కొఠారి, జస్టిస్ పుష్పా సత్యనారాయణలతో కూడిన ప్రత్యేక డివిజన్ బెంచ్ ఈ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.


మే 7వ తేదీ నుంచి ప్రభుత్వం వైన్ షాపులు తెరిచేందుకు ఇటీవల కొన్ని షరతులతో కోర్టు అనుమతించింది. అయితే, దుకాణాలు తెరవగానే జనం సామాజిక దూరాన్ని ఏమాత్రం పాటించకుండా పెద్దఎత్తున బారులు తీరడం, నిబంధనలను తుంగలోకి తొక్కడంతో కోర్టు తాజాగా ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణం మూసేయాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ముందు మే 7 నుంచి వైన్ దుకాణాలు తిరిగి తెరుస్తున్నట్టు ఈనెల 4న తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ఈ జీవోను పలువురు లాయర్లు, సామాజిక కార్యకర్తలు కోర్టులో సవాలు చేశారు. అయితే, కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, లాక్‌డౌన్ అమల్లో ఉన్నందున కచ్చితంగా నిబంధనలు పాటించాలంటూ ఆదేశాలిచ్చింది.

Updated Date - 2020-05-09T01:49:27+05:30 IST