కరోనా టీకాకు చైనాలో క్లినికల్ ట్రయల్స్
ABN , First Publish Date - 2020-03-23T06:47:44+05:30 IST
కరోనా టీకాకు సంబంధించి చైనా తొలి దశ క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభించింది. ఈ నెల 16న మొదటి ట్రయల్ జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో ...

తొలిదశలో వూహాన్‌కు చెందిన 108 మందిపై పరీక్షలు
బీజింగ్, మార్చి 22: కరోనా టీకాకు సంబంధించి చైనా తొలి దశ క్లినికల్ ట్రయల్‌ను ప్రారంభించింది. ఈ నెల 16న మొదటి ట్రయల్ జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 18-60 ఏళ్ల వయస్సున్న 108 మందిని మూడు బృందాలుగా విభజించి భిన్నమైన డోసులు ఇచ్చారు. వీరంతా వూహాన్‌కు చెందినవారే. అయితే అమెరికా కూడా ‘‘18 నెలల్లో టీకాను కనుగొంటాం’’ అని ఈ నెల 16నే ప్రకటన చేయడం గమనార్హం.