పోలీసులు గ్రామస్థుల మధ్య ఘర్షణ.. 12 మందికి గాయాలు

ABN , First Publish Date - 2020-09-03T23:46:48+05:30 IST

గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు కొట్టారు. దీనిపై ఆగ్రహం చెందిన గ్రామస్థులు బలియా-లఖ్‌నవూ రహదారిని మూసివేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. అందుకు గ్రామస్థులు ససేమిరా అనడంతో..

పోలీసులు గ్రామస్థుల మధ్య ఘర్షణ.. 12 మందికి గాయాలు

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లోని ఓ గ్రామంలో ప్రజలకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో 12 మంది గ్రామస్థులు గాయపడ్డారు. బలియా జిల్లాలోని బలియా-లఖ్‌నవూ రహదారిపై గురువారం ఈ ఘర్షణ జరిగింది.


గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని పోలీసులు కొట్టారు. దీనిపై ఆగ్రహం చెందిన గ్రామస్థులు బలియా-లఖ్‌నవూ రహదారిని మూసివేశారు. పోలీసులు వారిని అక్కడి నుంచి తొలగించేందుకు ప్రయత్నించారు. అందుకు గ్రామస్థులు ససేమిరా అనడంతో బలవంతంగా వారిని అక్కడి నుంచి తరలించేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులపై గ్రామస్థులు రాళ్లు రువ్వడం ప్రారంభించారు.


గ్రామస్థుల దాడిని అడ్డుకునేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేయాల్సి వచ్చిందని స్థానిక ఏఎస్‌పీ సంజయ్ యాదవ్ అన్నారు. ఆరు ద్విచక్ర వాహనాల్ని గ్రామస్థులు ధ్వంసం చేశారని సంజయ్ యాదవ్ అన్నారు.

Updated Date - 2020-09-03T23:46:48+05:30 IST