సీజేఐ జస్టిస్ బాబ్డే తల్లిని మోసగించిన వ్యక్తి అరెస్ట్

ABN , First Publish Date - 2020-12-10T23:21:25+05:30 IST

భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ శరద్ అరవింద్

సీజేఐ జస్టిస్ బాబ్డే తల్లిని మోసగించిన వ్యక్తి అరెస్ట్

నాగపూర్ : భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ శరద్ అరవింద్ బాబ్డే తల్లి ముక్తా బాబ్డేను ఓ వ్యక్తి రూ.2.5 కోట్ల మేరకు మోసం చేశాడు. ఆమె ఆస్తికి కేర్‌టేకర్‌గా పని చేస్తున్న వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. 


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,  ముక్తా బాబ్డే వయసు 90 ఏళ్ళపైమాటే. ఆమె వృద్ధాప్యం సంబంధిత వ్యాధితో కూడా బాధపడుతున్నారు. ఆమెకు ఆకాశవాణి స్క్వేర్ వద్ద ‘సీజన్స్ లాన్’ పేరుతో కొంత ఆస్తి ఉంది. దీనిని వివాహాలు తదితర కార్యక్రమాలకు అద్దెకు ఇస్తూ ఉంటారు. ఈ వ్యవహారాలను చూడటం కోసం తపస్ ఘోష్ (49)ని కేర్ టేకర్‌గా నియమించారు. ఘోష్ పదేళ్ళ నుంచి ఈ లావాదేవీలు చూస్తున్నారు. ముక్తా వృద్ధాప్యాన్ని ఆసరాగా తీసుకుని ఘోష్ ‘సీజన్స్ లాన్’ అద్దెల రశీదులను ఫోర్జరీ చేశారు. సుమారు రూ.2.5 కోట్లకు పైగా మోసగించారు. వివాహాలు, తదితర కార్యక్రమాలకు ఈ లాన్‌ను అద్దెకు ఇచ్చి, వసూలు చేసిన సొమ్మును ఘోష్, ఆయన భార్య సక్రమంగా ముక్తాకు చెల్లించలేదు. 


దీంతో సీతాబుల్డి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, తపస్ ఘోష్‌ను మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. ఈ కేసుపై దర్యాప్తు చేసేందుకు డీసీపీ వినీత సాహు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేశారు. 


Updated Date - 2020-12-10T23:21:25+05:30 IST