సివిల్స్‌ ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2020-10-24T08:45:56+05:30 IST

ఈ నెల 4వ తేదీన నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌-2020 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది...

సివిల్స్‌  ప్రిలిమ్స్‌ ఫలితాలు విడుదల

న్యూఢిల్లీ, అక్టోబరు 23: ఈ నెల 4వ తేదీన నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌-2020 ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులందరూ మెయిన్స్‌ కోసం డిటెయిల్డ్‌ అప్లికేషన్‌ ఫారమ్‌(డీఏఎ్‌ఫ)ను ఆన్‌లైన్‌లో నింపాలని కమిషన్‌ సూచించింది. ఈ నెల 28 నుంచి నవంబరు 11 వరకు  http-s://www.upsc.gov.in   వెబ్‌సైట్‌లో డీఏఎఫ్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. సివిల్స్‌ మెయిన్స్‌ను 2021 జనవరి 8న నిర్వహించనున్నట్లు కమిషన్‌ ప్రకటించింది.

Updated Date - 2020-10-24T08:45:56+05:30 IST