కరోనాకు మందుపై ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా కీలక ప్రకటన

ABN , First Publish Date - 2020-06-22T22:43:39+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా నివారణ మందును అందుబాటులోకి తెస్తున్నట్లు...

కరోనాకు మందుపై ప్రముఖ ఫార్మా సంస్థ సిప్లా కీలక ప్రకటన

కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు మరో మందు.. గుడ్‌న్యూస్ చెప్పిన సిప్లా

ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనాకు నివారణ మందును అందుబాటులోకి తెస్తున్నట్లు ప్రముఖ దిగ్గజ ఫార్మా కంపెనీ సిప్లా ప్రకటించింది. సిప్రెమి పేరుతో ఈ మందును విడుదల చేయనున్నట్లు స్పష్టం చేసింది. ఈ మందును యాంటీవైరల్ డ్రగ్ రెమిడీసివిర్‌కు జనరిక్ వెర్షన్‌గా సిప్లా తెలిపింది. కోవిడ్-19 బారిన పడిన వారికి అత్యవసర పరిస్థితుల్లో సిప్రెమినీ అందిస్తే ఫలితం ఉంటుందని వెల్లడించింది.


ఇదిలా ఉంటే.. కేంద్ర వైద్యఆరోగ్య శాఖ పరిశోధనాత్మక థెరపీలో యాంటీవైరల్ డ్రగ్ రెమ్డీసివిర్‌ను ఇప్పటికే భాగం చేసిన సంగతి తెలిసిందే. సిప్లా వెల్లడించిన సిప్రెమి కరోనా నివారణకు తాజాగా కనుగొన్న మందుల్లో మూడవది కావడం గమనార్హం. ఇప్పటికే ఫాబిఫ్లూ పేరుతో గ్లెన్‌‌‌మార్క్, కోవిఫర్ పేరుతో హెటెరో కోవిడ్-19 నివారణకు మందులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.


రెమ్డీసివిర్ యాంటీవైరల్ డ్రగ్‌ను కోవిడ్-19 బారిన పడిన చిన్నారులకు, యువతీయువకులకు అత్యవసర సందర్భాల్లో మాత్రమే చికిత్సలో భాగంగా అందించేందుకు యూఎస్‌ఎఫ్‌డీఏ అనుమతినిచ్చింది. ఈ సిప్రెమి ధరను త్వరలో సిప్లా వెల్లడించనుంది. రెమ్డీసివిర్‌కు జనరిక్ వెర్షన్ అయిన ఈ సిప్రెమి గురించి సిప్లా ఫార్మా సోమవారం వెల్లడించిన కొన్ని గంటలకే బీఎస్‌ఈలో సిప్లా షేర్లు 9శాతం వృద్ధి చెందడం విశేషం.

Updated Date - 2020-06-22T22:43:39+05:30 IST