ఏసుక్రీస్తు విగ్రహం నుంచి నీరు.. భక్తుల ప్రత్యేక ప్రార్థనలు

ABN , First Publish Date - 2020-03-15T14:22:00+05:30 IST

చర్చి ప్రాంగణం లో ఏర్పాటుచేసిన ఏసుక్రీస్తు విగ్రహ కాలివేళ్ల నుంచి నీరు వస్తుండడాన్ని గమనించిన

ఏసుక్రీస్తు విగ్రహం నుంచి నీరు.. భక్తుల ప్రత్యేక ప్రార్థనలు

చెన్నై : చర్చి ప్రాంగణం లో ఏర్పాటుచేసిన ఏసుక్రీస్తు విగ్రహ కాలివేళ్ల నుంచి నీరు వస్తుండడాన్ని గమనించిన భక్తులు పారవశ్యంతో ప్రత్యేక ప్రార్థనలు చేపట్టారు. తిరునల్వేలి జిల్లా కూడన్‌కుళం సమీపం కూత్తంగుళి గ్రామంలో సిలు వైనాథర్‌ చర్చి ఉంది.


ఇక్కడ యేసుక్రీస్తును శిలువపై ఉంచినట్లుగా విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈస్టర్‌ పండుగను పురస్క రించుకొని క్రైస్తవులు 40 రోజుల ఉపవాస దీక్షలు చేస్తున్నారు. వారు ప్రతిరోజు మధ్యాహ్నం ఆలయంలో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో, శుక్రవారం ప్రార్థనలకు హాజరైన కొందరు యేసుక్రీస్తు విగ్రహం కాలివేళ్ల నుంచి నీరు వస్తుండడాన్ని గమనించారు. ఈ నీరు శనివారం కూడా ఆగకుండా వస్తుండడంతో ఈ విషయం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించడంతో పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి విగ్రహం వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేపట్టడంతో పాటు కాలుతున్న నీటిని తలపై చల్లు కుంటూ పారవశ్యయంలో మునిగిపోయారు.

Updated Date - 2020-03-15T14:22:00+05:30 IST