చైనాలో కొత్తగా మరో 10 కరోనా కేసులు...
ABN , First Publish Date - 2020-10-03T13:22:26+05:30 IST
చైనా దేశంలోని మెయిన్‌లాండ్‌లో కొత్తగా 10 మందికి కరోనా సోకింది....
బీజింగ్ (చైనా): చైనా దేశంలోని మెయిన్‌లాండ్‌లో కొత్తగా 10 మందికి కరోనా సోకింది. దీంతో చైనాలో మొత్తం విదేశాల నుంచి వచ్చిన 2,885 మందికి కరోనా సోకిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం వెల్లడించింది. చైనా దేశంలోని షాంఘై నగరంలో 4, గుంగ్ డాంగ్ లో 3, సిచూన్ లో 2, షానక్సీలో 1 కేసు వెలుగుచూశాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. 2,696 మంది కరోనా రోగులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 189 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని చైనా ఆరోగ్య కమిషన్ పేర్కొంది. తాజాగా కరోనా వచ్చిన రోగుల్లో మృతులు లేరని, కోలుకుంటున్నారని చైనా ఆరోగ్య కమిషన్ అధికారులు వివరించారు.