యాప్‌లపై నిషేధం మా మదుపరుల హక్కుల ఉల్లంఘన : చైనా
ABN , First Publish Date - 2020-09-03T20:04:40+05:30 IST
భారత ప్రభుత్వం తాజాగా 118 మొబైల్ యాప్‌లను నిషేధించడంతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీటిని నిషేధించడం

న్యూఢిల్లీ : భారత ప్రభుత్వం తాజాగా 118 మొబైల్ యాప్‌లను నిషేధించడంతో చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. వీటిని నిషేధించడం చైనీస్ ఇన్వెస్టర్లు, సర్వీస్ ప్రొవైడర్ల చట్టబద్ధ ప్రయోజనాలకు విఘాతం కలుగుతోందని చైనా ఆందోళన వ్యక్తం చేసింది.
చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి గావో ఫెంగ్ మీడియా బ్రీఫింగ్‌లో మాట్లాడుతూ, చైనీస్ మొబైల్ యాప్స్‌పై భారత దేశం విధించిన నిషేధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.
డేటా ప్రైవసీ, జాతీయ భద్రతకు ముప్పు వంటి కారణాల వల్ల భారత ప్రభుత్వం తాజాగా 118 మొబైల్ యాప్‌లపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. అత్యంత ప్రజాదరణ పొందిన పబ్‌జీ కూడా నిషేధాన్ని ఎదుర్కొంది. దీంతో మొత్తం నిషేధానికి గురైన మొబైల్ యాప్‌ల సంఖ్య 224కు చేరింది.