చైనా కంపెనీతో ఆపిల్ భారీ డీల్.. ఎంత పలుకుతోందంటే..

ABN , First Publish Date - 2020-12-26T12:17:18+05:30 IST

ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న లేటెస్ట్ మోడల్ మొబైల్ ఐఫోన్ 12 ఉత్పత్తిలో ఓ చైనా కంపెనీని భాగస్వామిని చేయాలని నిర్ణయించింది.

చైనా కంపెనీతో ఆపిల్ భారీ డీల్.. ఎంత పలుకుతోందంటే..

బీజింగ్: ప్రపంచ ప్రఖ్యాత టెక్నాలజీ సంస్థ ఆపిల్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ కంపెనీ నుంచి వస్తున్న లేటెస్ట్ మోడల్ మొబైల్ ఐఫోన్ 12 ఉత్పత్తిలో ఓ చైనా కంపెనీని భాగస్వామిని చేయాలని నిర్ణయించింది. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత చైనా-అమెరికా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. దీంతో చాలా అమెరికన్ కంపెనీలు చైనాతో బంధాలను ఆల్‌మోస్ట్ తెంపేసుకున్నాయి. చైనా కంపెనీలపై అగ్రరాజ్యంలో బ్యాన్ విధించడంతో.. చైనా కూడా ఆపిల్ వంటి కంపెనీలను తమ దేశంలో బ్యాన్ చేస్తామని బెదిరించింది. అయితే ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయి జో బైడెన్ విజయఢంకా మోగించారు. దీంతో ఈ రెండు దేశాల మధ్య పరిస్థితులు చక్కబడే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ క్రమంలో ఆపిల్ కంపెనీ నుంచి చైనా సంస్థకు ఈ భారీ ఆఫర్ రావడం గమనార్హం. వచ్చే ఏడాదిలో చైనాకు చెందిన బీవోఈ సంస్థ.. ఐఫోన్ 12 మొబైల్ ప్యానెల్స్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ కంపెనీ నుంచి ఆపిల్.. సుమారు కోటి ప్యానెల్స్ ఆర్డర్ ఇచ్చినట్లు సమాచారం. ఐఫోన్ 12 సేల్స్ గనుక పెరిగితే 2కోట్ల ప్యానెల్స్ ఆర్డర్ ఇచ్చేందుకు ఆపిల్ కంపెనీ సిద్ధంగా ఉందట.

Updated Date - 2020-12-26T12:17:18+05:30 IST