మా దేశస్తుల్లో కరోనా రోగనిరోధక శక్తి లేదు: చైనా అంటువ్యాధుల నిపుణుడు

ABN , First Publish Date - 2020-05-17T19:55:14+05:30 IST

చైనాలో అధికశాతం మంది ప్రజలకు కరోనాను ఎదిరించే రోగనిరోధక శక్తి లేదని ఆ దేశ ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. జాంగ్ నాన్‌షాన్ వ్యాఖ్యానించారు.

మా దేశస్తుల్లో కరోనా రోగనిరోధక శక్తి లేదు: చైనా అంటువ్యాధుల నిపుణుడు

బీజింగ్: చైనాలో అధికశాతం మంది ప్రజలకు కరోనాను ఎదిరించే రోగనిరోధక శక్తి లేదని ఆ దేశ ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డా. జాంగ్ నాన్‌షాన్ వ్యాఖ్యానించారు. దీంతో మరోసారి కరోనా దాడి చేసే అవకాశం ఉందని వ్యాఖ్యానించారు. కరోనాతో పోరాడుతున్న ఇతర దేశాల కంటే తమ పరిస్థితి అంత మెరుగ్గా ఏమీ లేదని అభిప్రాయపడ్డారు. 2003లో చైనాలో ప్రబలిన సార్స్ వ్యాధిని కట్టడి చేసిన హీరోగా ఆయన ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. ఇక కరోనా వ్యాధి ఒకరి నుంచి మరొకరికి పాక గలదని జనవరిలోనే ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం పరిస్థితుల్లో చైనాకు జాంగ్ అవసరం ఎంతో ఉందని అక్కడి ప్రభుత్వం భావిస్తూ ఉంటుంది. దీంతో జాంగ్ తాజా వ్యాఖ్యలకు చైనాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అధిక ప్రాధాన్యం ఏర్పడింది. 

Updated Date - 2020-05-17T19:55:14+05:30 IST