విదేశాల్లోనూ చైనా వ్యాక్సిన్ పరీక్షలు
ABN , First Publish Date - 2020-04-01T06:04:55+05:30 IST
కరోనావైర్సను అరికట్టడానికి చైనా తయారుచేస్తున్న వ్యాక్సిన్ను విదేశాల్లో కూడా పరీక్షించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం చైనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది.

బీజింగ్, మార్చి 31: కరోనావైర్సను అరికట్టడానికి చైనా తయారుచేస్తున్న వ్యాక్సిన్ను విదేశాల్లో కూడా పరీక్షించాలని చైనా ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం చైనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉంది. 18 నుంచి 60 ఏళ్లలోపు వయసున్నవారిపై వుహాన్లో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అక్కడ పరీక్షల్లో వ్యాక్సిన్ సురక్షితమేనని తేలిన తర్వాత, కరోనా ఎక్కువగా సోకిన మరో ఇతర దేశంలోనూ దాన్ని పరీక్షించాలని చైనా అధికారులు ప్రభుత్వానికి సూచించారు. అదే విధంగా చైనాలో నివశిస్తున్న విదేశీయులపై కూడా వ్యాక్సిన్ ఉపయోగించనున్నారు. తద్వారా ఇతర దేశాల్లో కూడా ఈ వ్యాక్సిన్ను వాడే అవకాశం ఉంటుంది.