మూడోదశ ప్రయోగాలకు చైనా వ్యాక్సిన్‌

ABN , First Publish Date - 2020-07-08T06:52:26+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌ తయారీ రేసులో చైనా మరో ముందడుగు వేసింది. ఆ దేశానికి చెందిన సినోవ్యాక్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షల్లో చిట్టచివరివైన మూడో దశకు చేరింది...

మూడోదశ ప్రయోగాలకు చైనా వ్యాక్సిన్‌

బీజింగ్‌, జూలై 7 : కరోనా వ్యాక్సిన్‌ తయారీ రేసులో చైనా మరో ముందడుగు వేసింది. ఆ దేశానికి చెందిన సినోవ్యాక్‌ బయోటెక్‌ కంపెనీ అభివృద్ధి చేసిన కొవిడ్‌ వ్యాక్సిన్‌ ప్రయోగ పరీక్షల్లో చిట్టచివరివైన మూడో దశకు చేరింది. దీనితో త్వరలో బ్రెజిల్‌లో ట్రయల్స్‌ నిర్వహించనున్నట్లు సినోవ్యాక్‌ వెల్లడించింది. బ్రెజిల్‌కు చెందిన వ్యాక్సిన్‌ ఉత్పత్తి సంస్థ ఇన్‌స్టిట్యూటో బుటాంటన్‌తో కలిసి 9000 మంది ఆరోగ్య సిబ్బంది, వైద్యులపై వ్యాక్సిన్‌ను పరీక్షిస్తామని పేర్కొంది. ఒకవేళ మూడోదశలోనూ పరీక్షలు విజయవంతమైతే ఏటా 10 కోట్ల వ్యాక్సిన్లు ఉత్పత్తి చేసేందుకు ఓ ప్లాంటును కూడా సిద్ధం చేశామని సినోవ్యాక్‌ చెప్పింది. 


Updated Date - 2020-07-08T06:52:26+05:30 IST