ఈ పాపం చైనాదే.. నష్టాన్ని రాబట్టాలి

ABN , First Publish Date - 2020-04-05T08:30:11+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ కరాళనృత్యం చేయడానికి కారణం చైనాయేనని అంతర్జాతీయ న్యాయనిపుణుల మండలి(ఐసీజే) విమర్శించింది. ఈ పాపానికి నిష్కృతి లేదని, దీనికి ఒడిగట్టినందుకు చైనా నుంచి భారీ నష్టపరిహారం రాబట్టాలని

ఈ పాపం చైనాదే.. నష్టాన్ని రాబట్టాలి

  • యూఎన్‌హెచ్చార్సీకి న్యాయవేత్తల సూచన

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 4: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్‌ కరాళనృత్యం చేయడానికి కారణం చైనాయేనని అంతర్జాతీయ న్యాయనిపుణుల మండలి(ఐసీజే) విమర్శించింది. ఈ పాపానికి నిష్కృతి లేదని, దీనికి ఒడిగట్టినందుకు చైనా నుంచి భారీ నష్టపరిహారం రాబట్టాలని, ఆ శిక్ష అందరికీ గుణపాఠం కావాలని ఐసీజే... ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిని డిమాండ్‌ చేసింది. ‘ఇదంతా ఓ మిస్టరీలా కనిపిస్తోంది. చైనాలో కేవలం ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఇది విస్తరించింది. మిగిలిన దేశమంతా సేఫ్‌. కానీ ఆ వైరస్‌ అక్కడి నుంచి ప్రపంచదేశాలన్నింటికీ వ్యాపించింది. వేలల్లో చనిపోతున్నారు. దీనికి చైనా నాయకగణం, ఆర్మీ, వుహాన్‌ నగర భూమి.. అన్నింటినీ బాధ్యుల్ని చేయాలి’’ అని ఐసీజే అధ్యక్షుడు అఽధీష్‌ సీ అగర్వాలా అన్నారు.

Updated Date - 2020-04-05T08:30:11+05:30 IST