ఎవరెస్టుపై చైనా బృందం సర్వే
ABN , First Publish Date - 2020-05-18T08:56:56+05:30 IST
చైనాకు చెందిన ఓ సర్వే బృందం ఎవరెస్టు శిఖరం ఎక్కనుంది. కరోనా నేపథ్యంలో అక్కడికి పర్యాటకులు, పర్వతారోహకులను అనుమతించట్లేదు. ఇదే సమయంలో చైనా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓ బృందం ఎవరెస్టు...

బీజింగ్, మే 17: చైనాకు చెందిన ఓ సర్వే బృందం ఎవరెస్టు శిఖరం ఎక్కనుంది. కరోనా నేపథ్యంలో అక్కడికి పర్యాటకులు, పర్వతారోహకులను అనుమతించట్లేదు. ఇదే సమయంలో చైనా ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓ బృందం ఎవరెస్టు ఎత్తు, మారుతున్న వాతావరణం, అక్కడి సహజ వనరులు వంటి అంశాలపై సర్వే చేయనుంది. ఆ బృందం శుక్రవారం ఉదయం నాటికి ఎవరెస్టును అధిరోహించే అవకాశం ఉంది. చైనా ఇప్పటివరకు ఎవరెస్టుపై ఆరు కీలక సర్వేలు చేపట్టింది. 1975లో చైనా చేపట్టిన సర్వేలో ఎవరెస్టు ఎత్తు 8,848 మీటర్లుగా, 2005లో చేపట్టిన సర్వేలో 8,844 మీటర్లుగా తేలింది.