కరోనా రిస్క్ ఉంటే..డైపర్లు పెట్టుకోండి: చైనా

ABN , First Publish Date - 2020-12-10T17:53:42+05:30 IST

చైనా విమానయాన మంత్రిత్వ శాఖ ఫ్లైట్ సిబ్బంది రక్షణ దృష్ట్యా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్న విమానాల్లో..సిబ్బంది డైపర్లు ధరించాలని సూచించింది.

కరోనా రిస్క్ ఉంటే..డైపర్లు పెట్టుకోండి: చైనా

బీజింగ్: కరోనా సంక్షోభం కారణంగా విమానయాన రంగం తీవ్రమైన ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయితే..ఇటీవల వివిధ దేశాల్లో లాక్ డౌన్ ముగియడంతో మెల్లమెల్లగా విమాన సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో చైనా విమానయాన మంత్రిత్వ శాఖ ఫ్లైట్ సిబ్బంది రక్షణ దృష్ట్యా కీలక ఉత్తర్వులు జారీ చేసింది. కరోనా సోకే అవకాశం ఎక్కువగా ఉన్న విమానాల్లో..సిబ్బంది డైపర్లు ధరించాలని సూచించింది. ప్లేన్‌లోని బాత్రూమ్‌లు వినియోగించవద్దని స్పష్టం చేసింది. ఈ నిబంధన సాధారణ ఎయిర్‌లైన్ కంపెనీలతో పాటూ ఛార్టెడ్ ఫ్లైట్‌లకూ వర్తిస్తుందని పేర్కొంది.  


కాగా.. కరోనా సంక్షోభం కొనసాగుతున్నా విమానప్రయాణాలు కొనసాగించవచ్చని ఎయిర్‌లైన్స్ తొలి నుంచీ చెబుతూ వస్తున్నాయి. విమానాల్లో ఎయిర్ ఫిల్టర్లలకు ఆస్పత్తుల్లోని పరికరాలతో సరితూగే సామర్థ్యం ఉంటుందని అవి చెప్పుకొచ్చాయి. అయితే..దీని వల్ల కరోనా రిస్క్ కనిష్ట స్థాయికి చేరుకునేందుకు శాస్త్రపరమైన ఆధారాలేమీ ప్రస్తుతానికి అందుబాటులో లేవు. విమానంలోని ప్రయాణికులు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటించినా కూడా కొన్ని సందర్భాల్లో కరోనా వ్యాప్తి జరిగిందని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. కరోనా దెబ్బకు కుదేలైన చైనా విమానయాన రంగం ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. అంతర్జాతీయ సర్వీసులు పరిమితంగానే ఉన్నా దేశీయంగా డిమాండ్ పుజుకోవడంతో ఎయిర్‌లైన్స్ సంస్థలు సంబరపడుతున్నాయి. 


Updated Date - 2020-12-10T17:53:42+05:30 IST