నేపాల్‌కు హుటాహుటిన చైనా బృందం
ABN , First Publish Date - 2020-12-29T09:05:46+05:30 IST
నేపాల్‌లో అధికార నేషనల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో విభేదాలు తారస్థాయికి చేరడంతో చైనా హుటాహుటిన తమ ప్రతినిధుల
కాఠ్మాండూ, డిసెంబరు 28: నేపాల్‌లో అధికార నేషనల్ కమ్యూనిస్టు పార్టీ(ఎన్‌సీపీ)లో విభేదాలు తారస్థాయికి చేరడంతో చైనా హుటాహుటిన తమ ప్రతినిధుల బృందాన్ని నేపాల్‌కు పంపింది. నలుగురితో కూడిన ఈ బృందానికి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా(సీపీసీ) అంతర్గత వ్యవహారాల శాఖ సహాయ మంత్రి గువో యెఝౌ నేతృత్వం వహించడం గమనార్హం. 4 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ప్రతినిధులు నేపాల్‌లోని కీలక రాజకీయ నేతలందరితోనూ భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఎన్‌సీపీలో ప్రధాని ఓలి వర్గానికి, ప్రచండ వర్గానికి మధ్య విభేదాలు తారస్థాయికి చేరిన సంగతి తెలిసిందే. ఇరు రెండు వర్గాల మధ్య సమన్వయానికి చైనా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోందని కాఠ్మాండూ పోస్ట్ పత్రిక అంచనా వేసింది.