చైనా ఏడాదిలో ఎన్నిఫోన్లు భార‌త్‌లో విక్ర‌యిస్తుందంటే...

ABN , First Publish Date - 2020-06-23T16:43:27+05:30 IST

ఒక‌వైపు భారత్‌- చైనాల మ‌ధ్య సంబంధాలు క్షీణిస్తుండ‌గా, మరోవైపు చైనా నుంచి వెలువ‌డుతున్న కొన్ని గణాంకాలు చాలా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. 2019లో చైనా సుమారు రూ. 1.4 లక్షల కోట్ల విలువైన...

చైనా ఏడాదిలో ఎన్నిఫోన్లు భార‌త్‌లో విక్ర‌యిస్తుందంటే...

న్యూఢిల్లీ: ఒక‌వైపు భారత్‌- చైనాల మ‌ధ్య సంబంధాలు క్షీణిస్తుండ‌గా, మరోవైపు చైనా నుంచి వెలువ‌డుతున్న కొన్ని గణాంకాలు చాలా ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్నాయి. 2019లో చైనా సుమారు రూ. 1.4 లక్షల కోట్ల విలువైన‌ ఎలక్ట్రానిక్ వస్తువులను భారత్‌లో విక్రయించినట్లు గణాంకాల ద్వారా తెలుస్తోంది. ఇదిలావుంటే తాజాగా చైనా కంపెనీల వ్యాపారానికి అడ్డుక‌ట్ట వేసేందుకు మోదీ ప్రభుత్వం కొన్ని సుంకాలను విధించడానికి సిద్ధమవుతోంది. అలాగే జాతీయ భద్రతకు అడ్డంకిగా ఉన్న చైనా కంపెనీల‌ను నిషేధించేందుకు స‌న్నాహాలు చేస్తోంది. అదే సమయంలో షియోమి, వివో, ఒప్పో త‌దిత‌ర‌ ప్రైవేట్ స్మార్ట్‌ఫోన్ కంపెనీలపై ఇప్ప‌ట్లో ఈ ప్ర‌భావం ఉండ‌బోద‌ని అంటున్నారు. కాగా భారతదేశంలోని స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో చైనా వాటా క్రమంగా పెరుగుతోంది. 2018లో భారతదేశ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 60 శాతం వాటాను చైనా కంపెనీలు ఆక్రమించాయి. ఇది 2019లో 71 శాతానికి పెరిగింది. ఇప్పుడు 2020 మొదటి త్రైమాసికంలో ఈ వాటా అమాంతం 81 శాతానికి పెరిగింది. చైనాకు చెందిన షియోమి కంపెనీ భారతదేశంలో ఫోన్ల విక్ర‌యాల్లో మొదటి స్థానంలో ఉంది. 


Updated Date - 2020-06-23T16:43:27+05:30 IST