చైనా పచ్చినిజాలు చెప్పాలి: న్యాయవాది రవిబాత్రా
ABN , First Publish Date - 2020-04-07T08:23:30+05:30 IST
కరోనా వైరస్ వెనుక దాగిన పచ్చి నిజాలను చైనా ఇప్పటికైనా ప్రపంచానికి చెప్పాలని న్యూయార్క్‌కు చెందిన ఇండో-అమెరికన్ న్యాయవాది రవిబాత్రా డిమాండ్...

వాషింగ్టన్, ఏప్రిల్ 6 : కరోనా వైరస్ వెనుక దాగిన పచ్చి నిజాలను చైనా ఇప్పటికైనా ప్రపంచానికి చెప్పాలని న్యూయార్క్‌కు చెందిన ఇండో-అమెరికన్ న్యాయవాది రవిబాత్రా డిమాండ్ చేశారు. చైనా నోరు విప్పి నిజాలను చెబితే శాస్త్రవేత్తలు, వైద్యులు, ట్రంప్ సలహాదారు డాక్టర్ ఆంటోనీ ఫాసీ బృందం కష్టపడి దానికి విరుగుడును కనుగొంటారన్నారు. కరోనాతో తాను, తన భార్య రంజు, కుమార్తె యాంజెలాలు మృత్యుముఖం దాకా వెళ్లొచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు.