భారత్‌కు 1.70 లక్షల చైనా ‘పీపీఈ’లు

ABN , First Publish Date - 2020-04-07T08:21:54+05:30 IST

భారత్‌కు చైనా 1.70 లక్షల పీపీఈలను విరాళంగా అందించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. వీటికి దేశీయంగా తయారైన మరో 20 వేల పీపీఈలను కలిపి మొత్తం 1.90 లక్షల పీపీఈలు...

భారత్‌కు 1.70 లక్షల చైనా ‘పీపీఈ’లు

  • సింగపూర్‌ నుంచి త్వరలో మరో 10 లక్షలు


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 6: భారత్‌కు చైనా 1.70 లక్షల పీపీఈలను విరాళంగా అందించిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం వెల్లడించింది. వీటికి దేశీయంగా తయారైన మరో 20 వేల పీపీఈలను కలిపి మొత్తం 1.90 లక్షల పీపీఈలు ఆసుపత్రులకు పంపేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు 2.94 లక్షల పీపీఈలు సరఫరా చేశామని, వీటితో కలిపి మొత్తం 4.84 లక్షల పీపీఈలు అందుబాటులో ఉన్నట్లయిందని ఆరోగ్యశాఖ తెలిపింది. 18 లక్షల ఎన్‌95 మాస్కులను రాష్ట్రాలకు పంపిణీ చేశామని, దేశీయంగా తయారైన మరో రెండు లక్షల మాస్కులు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. కాగా, తమకు పీపీఈ, ఎన్‌95 మాస్కులు వెంటనే అందించాలన్న డిమాండ్‌తో ఔరంగాబాద్‌ డాక్టర్లు నిరసన బాట పట్టారు.

Updated Date - 2020-04-07T08:21:54+05:30 IST